
తిరుమలలో జనవరి 6న ఉదయం ధనుర్మాస కైంకర్యాల అనంతరం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని టీటీడీ అనిల్‌కుమార్ సింఘాల్ తలెిపారు.
అదే రోజు ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమువుతుందని అన్నారు. సర్వదర్శనంలో భక్తులు వైకుంఠద్వారా దర్శనం చేసుకోవచ్చునని అన్నారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
జనవరి 6న ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వర్ణరథం, జనవరి 7న ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం జరుగనున్నాయి.
జనవరి 5 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలను, గదులను కేటాయించడం లేదు. జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు,
సుపథం మార్గంలో ప్రవేశించేవారికి ప్రత్యేక దర్శనాలు కేటాయించడం లేదని చెప్పారు. జనవరి 4 నుండి 8వ తేదీ వరకు దివ్యదర్శనం టోకెన్లు, టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు నిలుపుదల చేయడమైనదన్నారు.
జనవరి 5 నుండి 8వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్లు నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు.
దర్శనం :
– జనవరి 6న ఉదయం ధనుర్మాస కైంకర్యాల అనంతరం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం.
– జనవరి 7వ తేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.
– జనవరి 5వ తేదీ ఉదయం నుండి భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తాం.
– జనవరి 6న భక్తులకు పంపిణీ చేసేందుకు 3 లక్షల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నాం.
– వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో 15 వేల మంది, మాడ వీధుల్లో 1.70 కోట్లతో ఏర్పాటుచేసిన జర్మన్ షెడ్లలో 40 వేల మంది,
నారాయణగిరి ఉద్యానవనాల్లో రూ.26 కోట్లతో నిర్మించిన షెడ్లలో 30 వేల మంది కలిపి మొత్తం 85 వేల మందికి పైగా భక్తులు చలికి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు.
24 గంటల పాటు ఘాట్ రోడ్లు :
– భక్తుల సౌకర్యార్థం జనవరి 6న 24 గంటల పాటు ఘాట్ రోడ్లు తెరిచి ఉంచడం జరుగుతుంది.
– జనవరి 7న తిరుమల నుండి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డు మాత్రమే తెరిచి ఉంచుతాం.
అన్నప్రసాద వితరణ :
– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో జనవరి 6న ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు, జనవరి 7న ఉదయం 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ.
డెప్యుటేషన్ సిబ్బంది :
– భక్తులకు సేవలందించేందుకు 700 మంది డెప్యుటేషన్ సిబ్బంది సేవలు. వీరిలో 26 మందికి సెక్టోరియల్ అధికారులుగా బాధ్యతలు.
శ్రీవారి సేవకులు :
– 3,500 మంది శ్రీవారి సేవకులు, 1300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో భక్తులకు సేవలు.
టిటిడి డైరీలు, క్యాలెండర్లు
– ప్రింటింగ్ సంస్థలు సకాలంలో చేరవేయకపోవడంతో డైరీలను సకాలంలో భక్తులకు అందించలేకపోయాం.
ఈసారి మరింత ముందుగా టెండర్లు ఖరారుచేసి ప్రింటింగ్ చేయిస్తాం. క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంచాం.
శ్రీవారి ఆలయాలు :
– వైజాగ్‌లో రూ.17 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. మరో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– ముంబయిలో దాతల సహకారంతో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మిస్తాం.
– జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం రెండు స్థలాలను ఎంపిక చేసింది. టిటిడి అధికారుల బృందం వెళ్లి స్థలాన్ని ఎంపిక చేసిన తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభిస్తాం.
ప్రత్యేక దర్శనాలు :
– జనవరి 21, 28వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం.
– జనవరి 22, 29వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.
Leave a Reply