
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 2020 ఏప్రిల్లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది.
కరెంట్ బుకింగ్ కింద 54,600 అర్జితసేవా టికెట్లను జారీ చేసింది.
ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,680 సేవా టికెట్లు, సుప్రభాతం 7,920, విశేషపూజ 1500 కేటాయించారు.
కల్యాణోత్సవం 12,825, తోమాల 140, అర్చన 140, అష్టాదళ పాదపద్మారాధన180 టికెట్లను కేటాయించింది.
వసంతోత్సవం 13,200, సహస్ర దీపాలంకరణ 15,600, నిజపాద దర్శనం 2,300 టికెట్లను తితిదే ఆన్లైన్ విడుదల చేసింది.
శుక్రవారం ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
అదేరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో భక్తులను తితిదే ఎంపిక చేస్తుంది.
Leave a Reply