
ఆ ఊరు ఉన్నది మాత్రం అత్యధిక నేరప్రవృత్తి ఉన్న రాష్ట్రంలో.
కానీ మా ఊర్లో మాత్రం క్రైమ్ రేటు సున్నా అంటే ఆశ్చర్యపోతారు.
ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు. తాళాలు అస్సలు కనపడవు. కానీ ఒక్క దొంగతనం కూడా జరిగిన దాఖలాలు లేవు.
ఇంతకీ ఆ ఊరు ఏది? మా ఊరిలో ఎంత మంది జనాభా ఉన్నారు.?
ఎప్పటి నుంచి ఇలా ఉంది? తెలుసుకోవాలి అనుకుంటే ఈ వార్త చదవాల్సిందే.
మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడి కి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది శని శింగనాపూర్ అనే ఒక గ్రామం ఉంది.
ఈ గ్రామంలో మూడు వేల మంది వరకు నివాసం ఉంటారు కానీ ఒక ఇంటికి కూడా తలుపు ఉండదు.
తలుపు లేనప్పుడు తాళం వేయాల్సిన అవసరం ఉండదు. అలా అని వేరే జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? అంటే అదీ లేదు.
కానీ ఆ ఊరిలో ఒక్కటంటే ఒక్కటి కూడా దొంగతనం జరగలేదంటే ఆశ్చర్యం కదూ..
దీనికి కారణం ఆ ఊరి జనం యొక్క నమ్మకం.
అక్కడ వెలసిన దేవుడు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు అనే విశ్వాసం.
ఇది నిన్న మొన్న కట్టుబాట్లతో ఏర్పాటు చేసుకున్నారు మోడల్ గ్రామం కాదు.
450 సంవత్సరాలు పైబడి ఇక్కడ ఇలాగే సాగుతుంది.
ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు కూడా తాళం వెయ్యరిక్కడ.
దుకాణాలు ఇల్లు ఏవైనా సరే రోజుల తరబడి అలాగే వదిలేసి వెళ్లిపోతారు.
తిరిగి వచ్చిన తర్వాత ఒక్క వస్తువు కూడా చెక్కుచెదరకుండా అలాగే ఉంటాయి.
అక్కడ వెలసిన శనీశ్వరుడు వారిని కాపాడతాడని దొంగతనానికి పాల్పడ్డ వారిని శిక్షిస్తాడు అనే నమ్మకంతో నేటికీ వారి ఇండ్లకు తలుపులు ఉండవు.
ఈ మనస్తత్వం ఏమిటో అర్థం కాక ఈ మహత్యం ఏంటో అంతుబట్టక శాస్త్రవేత్తలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
Leave a Reply