తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -15

పాశురము – 15

ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం 

ఓహో, పడుచుదనపు లేత చిలుకల మొలకా, ఇంకనూ నీవు నిద్రపోతున్నావా, లేచి రా. భగవంతుడికి ఇష్టమైనట్లుగా, తమ అహంకారమును తొలగించుకొని, భగవంతుడిపై ఆసక్తితో పరిపూర్ణులై అందరూ వచ్చియున్నారు.

భగవంతుడికి ఇష్టమైన అన్నిటిలోను సమర్థురాలివై వున్న నీవు, నీ చతురపు మాటలు, పాటలతో ఆ భగవంతుడిని కీర్తిస్తూ, నీవు మా ముందు వుంటావు అని అనుకుంటే, ఇంకా నీవు నిద్రనే లేవలేదు.

తొందరగా లేచి రా. అందరూ వచ్చారో లేదో లెక్కపెట్టుకొని, కువలయ పీడనము అను మదించిన ఏనుగును చంపిన ఆ శ్రీకృష్ణుడిని, మాయాలోలుడిని కీర్తిస్తూ వ్రతమును చేసే ప్రధాన ఆలయమునకు వెళ్లవలెను.

భగవంతుడి విషయమును రుచి చూసినవారు ఎదుటివారు చిన్నవారా, పెద్దవారా, గొప్పవారా లేక పేదవారా అను తారతమ్యములను చూడక అందరిని ఒకే విధముగా గౌరవించవలెను,

అని అంటూ ఆండాళ్ తల్లి పదవ గోపికను నిద్ర నుండి మేల్కొలిపెను. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*