శ్రీకృష్ణుడు నెమలిపించాన్ని ఎందుకు ధరిస్తాడు? దిష్టిపోవడానికా?

నెమలి పించం లేని శ్రీకృష్ణుడిని ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా? అంటే ఏం చెబుతాం. కాసేపు ఆలోచిస్తాం. అది సాధ్యం కాదు. నెమలి పించం, పిల్లనగోవి లేకుండా కృష్ణుడిని ఊహించుకోవడానికి కూడా కష్టమే.

మరి అంతగా విడదీయరాని బంధం కలిగిన నెమలి పించాన్ని శ్రీకృష్ణుడు ఎందుకు ధరిస్తాడు. అందం కోసం.. ఆనందం కోసమా? గోపికలను ఆకట్టుకోవడానికా? అంటే…

మరిదేనికి అంటే దిష్టిపోవడానికి.. దిష్టిపోవడానికా? అంటే అదే చెబుతున్నాయి. పురాణాలు. నల్లయ్యే అయినా కృష్ణుడు చాలా అందగాడు. చిన్నికృష్ణుడిని గోకులంలో ఎత్తుకోని మనిషి అంటూ ఎవరూ ఉండరు.

అలా ప్రతి ఒక్కరు ఎత్తుకుని పొగడ్తల వర్షం కురిపించవలన తన ముద్దుల కుమారుడికి దిష్టి తగిలి నలత చెందుతాడని యశోధ చిన్నికృష్ణుడికి చక్కగా జుట్టువేసి. ఆ జుట్టులో ముందుకు ముడి వేసి ఆ ముడిలో ఓ నెమలి పించం పెట్టేది.

గోకులంలో అప్పట్లో నెమళ్ళు చాలా ఎక్కువగా ఉండేవి. రకరకాల పించాలను కలిగి ఉండేవి. రోజుకో నెమలి పించాన్ని శ్రీకృష్ణుడి జుట్టులో ధరింపజేసేది.

అరె పించం ధరిస్తే దిష్టిపోతుందా? అదెలాగా అనే అనుమానం కలిగే అవకాశం ఉంది. మన పురాణాల్లో చాలా వాటికి వట్టి నమ్మకాలతో ఉండవు. దానికి లాజిక్ కూడా ఉంటుంది.

అలాంటిదే నెమలి పించం ధరించడంలోనూ ఉంది. ఏమిటదంటే.. మనకు ఎన్ని రంగులు కనిపిస్తాయో అన్ని రంగులు నెమలి పించంలో ఉంటాయట. పైగా మిలమిలి మెరుస్తూ ఉంటాయట.

ఆ నెమలి పించాన్ని ధరించడం వలన తన బిడ్డపై పడే దృష్టి కాస్తా ఆ నెమలి పించంపై పడుతుందని, ఫలితంగా తన బిడ్డకు దిష్టి తగలకుండా ఉంటుందని యశోధ కృష్ణుడికి ధరింపజేసేదే తప్ప ఇందులో మరోటి లేదని పురాణాలు చెబుతున్నాయి.

కృష్ణుడు పెరిగి పెద్దవాడైన తరువాత పిల్లనగోవిని, నెమలి పించాన్ని ధరించినట్టు ఏ గ్రంథాలలోనూ లేదని చెప్పే పురాణ పఠనం చేసే వారు చెబుతున్నారు.

మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. నెమలి సంభోగం చేయని ఏకైన ప్రాణి అని, తాను కూడా గోపికలపట్ల స్నేహం తప్ప మరే ఇతర ఉద్దేశ్యాలు లేవని చెప్పడానికే శ్రీకృష్ణుడు నెమలి పించం ధరించాడనే వాదన కూడా ఉంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*