తిరుమలలో నూతన సంవత్సం ఎలా ఉంటుందో చూస్తారా..! (వీడియో)

తిరుమల కిటకిటలాడుుతోంది. నూతన ఆంగ్లసంవత్సరాది కావడంతో జనం తిరుమలకు క్యూ కట్టారు. ఎక్కడ చూసినా జనమే జనం కనిపిస్తున్నారు.

తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఉన్న కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి. క్యూలైన్ బయటకు వచ్చేసింది. దాదాపుగా 3 కి.మీ. పాటు ఈ క్యూ నడుస్తోంది.

నూతన సంవత్సర సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే జనం తిరుమలకు పరుగులు పెట్టారు. వారిలో ప్రముఖలు కూడా ఉన్నారు.

తెలంగాణ కోమటి రెడ్డి, గాయకుడు హేమచందర్ దంపతులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇలా ఒకరేంటి చాలా ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు.

ఒకవైపు ఎముకలు కొరికే చలి ఉన్నా లెక్క చేయకుండా స్వామి దర్శనం కోసం జనం రోడ్లపైనే ఉన్నారు. స్వామి దర్శనానికి కనీసం 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది.

ఏమైనా సరే స్వామి దర్శనం చేసుకుని కొండ దిగాలి అని పట్టుదలగా ఉండేవారు చాలా మందే ఉన్నారు.

[embedyt] https://www.youtube.com/watch?v=SGXGTVTbtE0[/embedyt]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*