
అహోబిల క్షేత్రంలో నరసింహ మహాయాగం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు నరసింహ మహాయాగం జరుగనుంది.
ప్రపంచశాంతి కోసం, మానవులకు భయం,ఈతి బాధలు తొలగించాలని నరసింహస్వామివారిని ప్రార్థిస్తూ ఈ యాగం నిర్వహిస్తామని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు తెలిపారు.