పాశురము -12
కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
తెలుగు అర్థం
ఓ గొప్ప ఐశ్వర్యవంతుడి చెల్లెలా, తెల్లవారినది నిద్ర లేచి రా. మీ ఇంటి వద్ద ఆవులకు పాలు తీసేవారు ఇంకా రానందువలన, పాలతో నిండిన వాటి పొదుగులు బరువెక్కి, ఆ పాలు వాటంతట అవే కారి, మీ ఇంటి వాకిలి అంతా బురద బురద అయినది.
ఆకాశము నుండి మంచు కురుస్తూ వుండడం వలన, మాకు నిలుచునేందుకు చోటు లేక, మీ ఇంటి చూరును పట్టుకొని నిలుచున్నాము.
చాలా గొప్ప ఐశ్వర్యవంతుడైన మీ అన్న, ఇంతవరకూ, తన మనస్సులో భగవంతుడి గురించి ఆలోచనే లేని అతడు, మేము చేస్తున్న ఈ వ్రతమును గురించి తెలుసుకొని, ఆయన మనస్సు కరిగి మెత్తబడి, ఆవుల యొక్క పొదుగు నుండి వచ్చు పాలవలె, ఆర్థ్రత పొందుచున్నది.
అటువంటి మంచి గుణములు కలిగిన అన్నకి చెల్లెలివై వున్న నీవు, ఇంకా నిద్రిస్తూనే వున్నావు. లేచి రా. రామావతార సమయమున దక్షిణ దిక్కున వున్న అందమైన లంకానగరమునకు రాజు అయిన రావణాసురుడిని చంపిన మనోహరుడైన ఆ సర్వేశ్వరుడు ,
శ్రీరామచంద్రుడి కళ్యాణగుణములను పాడుతున్నాము. ఆ పాటలను విని, భగవంతుడిపై ఆసక్తి లేనివారు కూడా, ఆ భగవంతుడే సమస్తము అను విధముగా మారిపోతున్నారు. కాని నీవు మాత్రము నిద్ర లేవకుంటివి. ఏమిటి మాట్లాడడం లేదు. ఇదేమి గాఢ నిద్ర తల్లీ, ఈ వూరిలోని చుట్టుప్రక్కల వారందరూ
లేచి, మన వ్రతము గురించి తెలుసుకున్నారు. ఇకనైనా నీవు నిద్ర లేచి వచ్చి మాతో కలువు, అని ఆండాళ్ తల్లి మనలోని భక్తిభావముతో కూడుకున్న ఆర్థ్రతను, ఏడవ గోపికగా మేల్కొలిపెను. ఇదియే ఇందులోని అభిప్రాయము.
Leave a Reply