లడ్డూ…! కావాలా నాయనా.. !! భక్తులకు ఉచిత లడ్డూ… టీటీడీ యోచన

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఉచితంగా లడ్డూలను ఇచ్చే యోచనలో పడింది. ఈ అవకాశాన్ని వైకుంఠ ఏకాదశి నుంచి ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగిన విషయం తెలసిందే.

ఈ సందర్భంగా లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వాహణా అధికారి ఏవి ధర్మా రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఆ తరువాత నిర్ణయం ఏమి జరిగిందో తెలియదు కానీ, తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఒక్క లడ్డూను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

సాధారణంగా స్వామి దర్శనం జరిగిన తరువాత ప్రసాద వితరణ జరిగేది. అందులో లడ్డూ ఉండవచ్చు. మరే ఇతర అన్నప్రసాదం ఉండవచ్చు. లడ్డూ అయితే ఓ చిన్న ఉండను ఇస్తుంటారు.

దానితో సంబంధం లేకుండా ఉచిత లడ్డూ టోకెన్‌ను అందజేయనున్నారు. లడ్డూను మాత్రం లడ్డూ కౌంటర్ లో తీసుకోవాల్సి ఉంటుంది.

అదనపు లడ్డూ కావాలంటే కూడా క్యూలైన్లలోనే టికెట్లు తీసుకునే ఏర్పాటు కూడా చేస్తోంది. అయితే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కానీ ప్రతి లడ్డూకు ధర చెల్లించాల్సిందే.

ఒక ఇంట్లో నలుగురు దర్శనానికి వెళ్ళితే నాలుగు లడ్డూ వస్తాయన్నమాట. పేద భక్తులకు ఇది పెద్ద ఊరటే

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*