మంగళ, శుక్రవారాలు డబ్బు ఇస్తే ఏమవుతుంది? ఇంట్లోంచి లక్ష్మీ వెళ్ళిపోతుందా?

సాధారణంగా మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇవ్వాలంటే చాలా మంది ఒప్పుకోరు. పట్టణాల్లో కొంత సడలింపు ఉన్నా, పల్లెల్లో నేటికీ దీనిని పాటిస్తుంటారు.

మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇతరులకు ఇవ్వడం వలన లక్ష్మిదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడదని అంటారు. కానీ, శాస్త్రాలలో పెద్దగా దీని ప్రస్తావన రాలేదు.

కాకపోతే, ఒకటి మాత్రం ఉంది. ఏ రోజైనా ఉదయం, సాయంంత్ర సమయాలలోనూ, పూజ చెయ్యగానే సంపదని ఇంటి నుంచి పంపకూడదని అంటారు. మనమేదైనా కొనుక్కోవటానికి మూల ధనాన్ని ఖర్చు చెయ్యకూడదు అని అర్థం.

కానీ, సమాజంలో పాటింపు మాత్రం జోరుగా సాగుతోంది. డబ్బే ఇవ్వ కూడదని కూలీలను కూడా పంపేస్తుంటారు. కష్టపడిన వాడికి డబ్బు ఇవ్వకపోతే వాడి పొట్ట కొట్ట కూడదు కదా.

కానీ, చాలా ప్రాంతాలలో మంగళవారం, శుక్రవారం డబ్బు ఇవ్వరు ఎందుకు? ఇదోకటే కాదు. నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు.

అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు. ఎవరి నమ్మకాలూ, ఆచారాలూ వారివి.

అసలు వీటి అర్థం ఏమిటంటే, ప్రకృతి సమతుల్యం చేసినట్లే మనవాళ్ళు జనాన్ని సమతుల్యం చేసేవారు. సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. జల్సాలు చేస్తుంటారు. ఇది నేటికీ ఉంది.

వీరిని బ్యాలెన్సు చేయాలి కదా? అంటే ఖర్చు తగ్గించుకోవాలి కదా. డబ్బు మారకం లేకపోతే, దానంతట అదే ఖర్చు తగ్గుతుంది.

అందుకే కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము చేశారు. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు.

ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతేగానీ, అత్యవసరాల్లో ఉన్నవారికీ, కష్టపడిన వారికి ఇవ్వద్దని కాదు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*