తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -11

పాశురము 11

కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం
పాడిపంటలు పుష్కలముగా వున్న రేపల్లెలో సంతృప్తిగా గడ్డి మేసి, ఎప్పుడూ సమృద్దిగా పాలు ఇచ్చు లేతవయస్సు గల ఆవులు మందలు మందలుగా వున్న గోపకులములోని గోపాలురు ఆరోగ్యవంతులై,

ధీరులై, శూరులై కంసుడి రాజ్యమునకు వెళ్లి, ఎదిరించి, చంపిన బలరామకృష్ణుడి వలె శత్రువులపైకి వెళ్లి, ఎదిరించే శక్తిసామర్థ్యములు కలిగి వుండెదరు. వారు ధర్మాధర్మ విచక్షణతో, నీతినియమములతో,

ఎటువంటి దోషములు లేని సమాజమును నిర్మించుకుందురు. అటువంటి గొప్ప గోకులమున పుట్టిన పాముకుబుసము వంటి సుతిమెత్తటి శరీరము కలిగి, పురివిప్పిన నెమలి వంటి కాంతులీను

సహజసిద్దమైన,అందమైన బంగారపు తీగవలె ప్రకాశించుదానా, నీ బంధువులు, స్నేహితులు అందరము కలిసి వచ్చి, నిన్ను పిలుచుటకు నీ వాకిలి ముందు నిలుచున్నాము. నీవు మాత్రము కదలక

మెదలక, నిద్ర పోతున్నావు. ఎంత పిలిచినా, ఒక్కమాట అయినా మాట్లాడవు. మనము చేయు వ్రతమును మరచి, నీవు నిద్ర పోతున్నావు. ఓ భాగ్యవంతురాలా, లేచి రా. నాకేమిటి, నాకు అన్నీ

వున్నాయి, ఆ లక్ష్మీదేవియే నాతో వున్నది, అటువంటప్పుడు ఆ వ్రతము చేయక పోయినా వచ్చే నష్టమేమి లేదు, అను నిర్లక్ష్యము నీకు కలిగినదా. ఆ భగవంతుడైన శ్రియఃపతిని సేవిస్తేనే

కదా,ఆయనతో పాటు ఆ అష్టలక్ష్మి మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా వుంటుంది. అందుకే నీవు వెంటనే నిద్ర లేచి, మాతో కలువు, అని ఆండాళ్ తల్లి మనలోని నిర్లక్ష్యమును వెళ్లగొడుతూ, ఆరవ గోపికను మేల్కొలిపెను. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*