తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -10

పాశురము 10

నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్

తెలుగు అర్థం 
అపూర్వమైన విలువైన వివిధ ఆభరణములు కలిగి, సుఖములో తేలియాడు ఓ తల్లీ, మా అందరి కన్నా ముందుగానే లేచి, చక్కగా నోమును నోచి, మంచి ఫలితమును పొందాలి, అని అనుకున్నావే.

ఆ విధముగా చేయాలి అంటే, నీవు మాకన్నా ముందుగా నిద్ర లేవాలి కదా. కాని ఏమిటి, మేము వచ్చి నిన్ను ఎంత పిలిచినా, వాకిలి తలుపు అయినా తెరవలేదు.

కనీసము సమాధానము అయినా చెప్పడం లేదు. ఇంకా నీవు నిద్ర లేవలేదా. అంత గాఢ నిద్ర పోతున్నావు ఏమిటి, కుంభకర్ణుడితో పోటీ పెట్టుకున్నావా.

ఆ కుంభకర్ణుడు నీతో ఓడిపోయి, తన నిద్రను కూడా నీకు ఇచ్చాడా. తెలివి తెచ్చుకొని మేలుకో. రామావతారమున రాముడు, రావణాసురుడి తమ్ముడు అయిన కుంభకర్ణుడిని సం హరించెను.

అదే విధముగా ఆ భగవంతుడిని సేవించినచో, నీలో దాగివున్న, కుంభకర్ణుడి నిద్ర తొలగును. నీవు తలుపులు తెరవక పోయినా ఫరవాలేదు. కనీసము మా మాట అయినా విని పలకవా.

తొందరగా లేచి వచ్చి తలుపులు తెరువు. పరిమళించు తులసిమాలల కిరీటమును ధరించిన ఆ శ్రీమన్నారాయణుడిని మనమందరము కలిసి కీర్తించెదము. ఆ స్వామి ధర్మాత్ముడు.

ఆయన మనకు కావలసినవన్నిటిని ఇచ్చి, తన ఆశ్రయ స్థానమైనట్టి ఆ పరమపదమును ప్రసాదించును. లేచి వచ్చి మా వ్రతములో చేరుము, అని ఆండాళ్ తల్లి మనలో దాగి వున్న

అశ్రద్దను విడిచి, భగవంతుడిని ధ్యానించుము, అని ఐదవ గోపికను మేల్కొలిపెను. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*