భోగేశ్వరుడికి నమక, చమక అభిషేకం? అదేం అభిషేకమో తెలుసా?

సాధారణ అభిషేకం చూశాం. రుద్రాభిషేకం చూశాం. పంచామృత అభిషేకం చూశాం. ఇంకా ఎన్నో అభిషేకాలను చూశాం. కానీ, ఈ నమక, చమక అభిషేకం ఏంటి? అంటే అర్థం ఏంటి?

తెలుసుకోవాలని ఉందా? సాధారణంగా గుడి వెళ్ళి దండం పెట్టుకుని, ఆశీర్వచనం తీసుకుని వచ్చే సాధారణ భక్తులకు ఇది తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ, శివతత్వంతో సంబంధం ఉన్న వారికి దీనిని గురించి తెలిసే అవకాశం ఉంది.

నమక, చమక అభిషేకంలో చాలా అర్థం ఉంది. భగవంతునికి భక్తునికి అనుసంధానంగా దీనిని భావించవచ్చు. పరమ దయపరుడైన శివుడు కోరిన వెంటనే ఫటాఫట్ వరాలిచ్చే స్వామి.

ఆ అనుగ్రహం ఈ అభిషేకంలో కనిపిస్తుంది. నమక, చమక అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అభిషేకం ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరిగింది అనే అంశాలను కూడా తెలుసుకుందాం.

రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. ‘నమ’తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను చెబుతారు. ‘చమే’ తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి.

ఇందులో నమకము చదవడమంటే రుద్రునికి భక్తుని ప్రార్థన అని అర్థం. ఇందులో పదకొండు అనువాకములు ఉంటాయి. ఈ పదకొండు అనువాకములు పూర్తయితే శివుణ్ణికి భక్తుడి వేడుక పూర్తయ్యిందని అర్థం.

ఇక చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనంగా చెప్పబడ్డాయి. చమకములో కూడా పదకొండు అనువాకములు ఉంటాయి. అవి చదవడం పూర్తయితే భక్తుడికి భగవంతుడి అనుగ్రహం లభించినట్లు భావిస్తారు.

నమక చమకములు కలిపి చదివితేని అభిషేకం సంపూర్ణం అయ్యిందని అర్థం. అంటే భక్తుడి వేడుకోలు, భగవంతుని అనుగ్రహం లభించడం పూర్తయినట్లు లెక్క. దీనినే నమక,చమక రుద్రాభిషేకం అంటారు.

ఎక్కడ జరిగింది.?

అనంతపురం జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన శివాలయాలలో పామిడి భోగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం మహన్యాసపూర్వక ఏకవర రుద్రాభిషేకం నిర్వహిస్తారు.

స్పష్టమైన మంత్రోచ్చారణ, రుద్రం (నమక, చమక)తో అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, మాఘమాసం, కార్తీక మాసంలో భక్తుల సంఖ్య అధిక సంఖ్యలో ఉంటుంది.

తిల నూనె అభిషేకం, శుభ్రాభిషేకం, పంచామృత భిషేకం, ఫలాభిషేకం, కుంకుమ, చందన, హరిద్ర, అభిషేకం, పరిమళ ద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. ఈరోజు సోమవారం కావడంతో ఈఅభిషేకాలు నిర్వహించి అభిషేకించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*