తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -7

పాశురము-7

కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం 
భగవంతుడి కథరసము అను అమృతమును ఎట్లు సేవించవలెనో తెలియని ఓ పిచ్చిపిల్లా, లేచి రా. తెల్లవారెను, అని అంటూ కీచుకీచుమను ధ్వనితో,

తమలో తాము మాట్లాడుకొను భరద్వాజ పక్షుల కిలకిలారావములు నీకు వినబడలేదా. ఆ పలుకులు, బ్రహ్మవేత్తలు తమ అనుభూతులను, అనుభవములను ఇతరులతో పంచుకున్నట్లుగా వున్నవి.

ఈ బృందావనములో పుణ్య స్త్రీలు అయిన గోపికారమణులు తమ యొక్క ధర్మమును మరువక, తమ యొక్క భర్త, పిల్లల పనులను మరియు కుటుంబ విథులను పూర్తి చేసుకొని, కాసుల పేరు వంటి

బంగారపు ఆభరణములతో అందముగా అలంకరించుకొని, అందమైన తమ జడలో పువ్వులు సింగారించుకొని, కవ్వముతో పెరుగును చిలుకుతున్న చప్పుడు నీకు వినబడలేదా.

ఆ భగవంతుడి యొక్క స్వరూప, రూప, గుణ, విభూతులను అర్థవంతముగా తెలుసుకొని, మన మనస్సున నిండుగా వుంచుకొనుటయే పెరుగు. అ విథముగా తెలుసుకున్న పెరుగును, భగవంతుడికి

సంబంధించిన జ్ఞానము అను కవ్వముతో, ఆ భగవంతుడికి ఇది చాలా ఇష్టము అనే త్రాడును కట్టి, చిలుకుట వలన, మనము ఏ పని చేసినా,

అది ఆ భగవంతుడికే చెందుతుంది అన్న ఆలోచన మనకు కలుగుతుంది. అదియే వెన్న. ఇదియే అమృతతత్వము.

ఓ నాయకురాలా, నీకు ఇటువంటి భగవంతుడి అనుభవము ఇంతకు ముందు కలిగే వుండును. నీ అనుభవమును ఇప్పుడు మాకు తెలిపి, మాకు నాయకురాలివై ఆ శ్రీకృష్ణుడిని చేరుటకు

సహాయమందించు. మనము ఏ రూపములో ఆ భగవంతుడిని తలుస్తామో, ఆ రూపములోనే
ఆ భగవంతుడు కనిపించును.మేము గుర్రము రూపములో వచ్చిన కేశి అను రాక్షసుడిని చంపిన

కేశవుడిని కీర్తిస్తున్నప్పుడు, నీ మనస్సులోన ఆ భగవంతుడి రూపము మెదులుతోందని నీ తలుపు సంథులలో నుంచి, నీ ముఖములోని ఆనంద తేజస్సును చూసిన మాకు తెలుస్తున్నది. ఓ తేజశ్శాలినీ,

తలుపులు తెరువు. నీ తేజస్సును చూసి మేము కూడా ఆనందించెదము ,అని రెండవ గోపికను నిద్ర నుండి మేల్కొలిపెను. మన మనస్సులోని తేజస్సును మేల్కొలుపుటయే, ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*