పెజావర్ మఠాధిపతి శివైక్యం

కర్ణాటకలోని ప్రముఖ మఠాల్లో ఒకటైన పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.

ఆయన కొద్ది రోజులుపాటు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స పొందారు.

ఆయన శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటీ పని చేయని స్థితికి రావడంతో, వైద్యులు తమ నిస్సాయతను వ్యక్తి చేశారు.

ఆయన తిరిగి కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చేడంతో ఆయనను మఠానికి తీసుకువచ్చారు.

ఆయన కోరిక మేరకు శిష్యులు ఆయనను మణిపాల్ ఆసుపత్రి నుంచి పెజావర్ మఠానికి తరలించారు.

మఠానికి చేరుకోవాలన్నట్లుగా అప్పటి వరకూ ఉన్న ఆయన మఠానికి తరలించిన కొద్దిసేపటికే కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు.

స్వామీ ఆరోగ్యం గురించి తెలియగానే కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉడిపి శ్రీకృష్ణ మఠానికి చేరుకున్నారు. ఆయన అంత్యక్రియలపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*