తిరుమలలో పదే పదే ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? (తాజా ప్రమాద వీడియో)

తిరుమలకు వచ్చే భక్తులు ఈ మధ్య కాలంలో పదే పదే ప్రమాదాలకు గురవుతున్నారు. ఎందుకు ? ఎక్కడ లోపం జరుగుతోంది? వాటి గురించి బయటడాలంటే ఏం చేయాలి?

సరిగ్గా పదిహేను రోజుల కిందట కర్ణాటక భక్తుల వాహనం బోల్తా. అంతుకు ముందు మరో వాహనం తిరుగు ప్రయాణంలో బోల్తా పడింది. ఇంచుమించు అదే ప్రదేశం మళ్ళీ కర్ణాటక భక్తుల కారు ప్రమాదానికి గురయ్యింది. ఏమిటి?

ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి. అదృష్టవశాత్తు మరణాలు సంభవించలేదు. దీనికి ప్రధాన కారణం రోడ్డుపై అవగాహన లేకపోవడమే. ఆ అవగాహన లేకపోవడం కారణంగానే ఈ పరిస్థితి నెలకొంటుంది.

తిరుమల ప్రయాణమయ్యే భక్తులు ప్రత్యేకించి సొంత వాహనాలలో ప్రయాణించే భక్తులు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. సాధ్యమైనంత వరకూ ప్రత్యేకమైన డ్రైవర్‌ను ఏర్పాటు చేసకుని రావాలి.

దర్శన సమయానికి ప్రయాణ సమయాన్ని సమన్వయం చేసుకుంటూ సరిపోయే సమయాన్ని తీసుకుని రావాలి. అప్పడు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

[embedyt] https://www.youtube.com/watch?v=ZYiTozQRHHk[/embedyt]

ఆదరబాదరగా తిరుమల ప్రయాణం చేయడం వలన చాలా మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. మృత్యువుకు దగ్గరవుతున్నారు.

ఇక తిరుమల చేరుకున్న తరువాత తిరుమల రెండవ ఘాట్(ఎక్కే ఘాట్ రోడ్డు)లో ప్రయాణించే సమయంలో నిర్ణీత సమయం ప్రకారం తిరుమల చేరుకోవాలి.

ఘాట్ రోడ్డులో కొన్ని చోట్ల ఇరుకైన మలుపులు ఉన్నాయి. ప్రత్యేకించి గాలిగోపురం సమీపంలో ఈ మలుపులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త వహించకపోతే, పక్కనే ఉన్న ప్రదేశాలలో పడిపోయే అవకాశం ఉంటుంది.

పదిహేను రోజుల కిందట బోల్తా పడి కర్ణాటక కారు సంఘటనే ఇందుకు నిదర్శనం. కనీసం 40 నిమిషాలు తిరుమలకు ప్రయాణించాలి.

వాహనాలలో వచ్చిన తాజా సామర్థ్యత కారణంగా వేగంగా మలుపులు తిరుగుతూ నిర్లక్ష్యంగా ప్రయాణించినప్పుడే ఇలాంటి సంఘనటలు జరుగుతున్నాయి.

అడుగడుగునా ఉన్న సూచిక బోర్డులను అనుసరిస్తూ ప్రయాణం చేస్తే ఎటువంటి ప్రమాదాలు ఉండవు. ఇక తిరుమల నుంచి తిరుపతి చేరుకోవడానికి కూడా అదే సమయం పడుతుంది.

పూర్తిగా డౌన్ రోడ్డు. దాదాపు 40 మలుపులు ఉంటాయి. ఎక్కే రోడ్డుకంటే ఎక్కువ ప్రమాదకరమైనది. తగినంత వెడల్పు ఉన్నా కూడా జాగ్రత్తగా లేకపోతే, పక్కనున్నా చిన్నచిన్న లోతు ప్రాంతాలలో పడిపోవడం ఖాయం.

తిరుగు ప్రయాణంలో స్వామిని దర్శించుకున్నామన్న ఆనందంలో లేదా త్వరగా ఇల్లు చేరుకోవాలనే ఆతృత వలనే ఇవి జరుగుతాయి.

ప్రత్యేకించి తిరుపతి ఇక మూడు కిలో మీటర్లు ఉందన్న సమయం నుంచి మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
తిరుమల నుంచి దిగే సమయంలో జాగ్రత్త, నిర్ణీత సమయంలో వాహనాన్ని న్యూట్రల్లో కాకుండా గేర్‌లో నడిపితే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*