
తిరుమల శ్రీవారి ఆలయంలో గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల నియామకానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఆయన ఇప్పటి వరకూ సలహాదారుగా ఉన్న ఆయన ఇకపై అర్చకులుగా కూడా ఉంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై వారు చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు.
తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. గొల్లమండపం మార్చేది లేదని స్పష్టం పాలకమండలి స్పష్టం చేసింది.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలోమాత్రమే వైకుంఠ దర్శనం ఉంటుందని ప్రకటించింది పది రోజులపాటు ఉంటుందనే అంశాన్ని కొట్టేసినట్లయ్యింది.
ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30కోట్లు మంజూరు చేసిన పాలక మండలి జమ్ము కశ్మీర్, వారణాసిలో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది.
ఆసుపత్రి డైరెక్టర్గా మదన్ మోహన్ రెడ్డి నియమించింది. సంక్రాంతిలోపు తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం దిశగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి 2019-20 వార్షిక రివైజ్డ్ బడ్జెట్ రూ. 3,243 కోట్లుకు ఆమోదం తెలిపింది. రూ.8 కోట్లతో రెండు ఘాట్ రోడ్డుల మరమ్మతులకు అనుమతులపై ఆమోద ముద్ర వేసింది.
ముంబైలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పాలకమండలి సమ్మతించింది. రూ.10 కోట్లతో రెండో ఘాట్రోడ్డులో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రూ.3.4 కోట్లతో తిరుపతిలోని కళ్యాణమండపాలకు ఏసీ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇవి కాకుండా మరిన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
Leave a Reply