అలిపిరిలో వ‌స‌తికి టీటీడీ ఛైర్మన్ స్థ‌ల ప‌రిశీలన

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు తిరుప‌తిలో వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో భాగంగా అలిపిరి వ‌ద్ద టిటిడి ఛైర్మ‌న్ ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ అలిపిరిలో భ‌క్తుల‌కు వ‌స‌తి ఏర్పాటు చేస్తే తిరుమ‌ల‌లో ర‌ద్ధీ అధికంగా ఉన్న స‌మ‌యంలో టైం స్లాట్ కేటాయించి తిరుప‌తిలోనే వ‌స‌తి క‌ల్పించ‌డానికి అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇందులో భాగంగా అలిపిరిలో నిర్మించ త‌ల‌పెట్ట‌నున్న వ‌స‌తి స‌ముదాయాల‌లో అన్న‌ప్ర‌సాదాలు, ధార్మిక కార్య‌క్ర‌మాలు, భ‌జ‌న‌లు, ధ్యానం, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఈ విష‌య‌మై టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో చ‌ర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలిపారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*