పామిడిలో గోదాదేవి పంచలోహ విగ్రహ ఆవిష్కరణ

పామిడి లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో “గోదాదేవి “నూతన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ధనుర్మాస భక్త మండలివారు ఈవిగ్రహాన్ని శ్రీరంగం నుండి తీసుకొచ్చి, ప్రత్యేక పూజలు జరిపారు. 1954నుండి నిర్వహిస్తున్న ధనుర్మాసపుజలు శ్రీకృష్ణ విగ్రహానికి, శ్రీకృష్ణ విశ్వరూప పాతమునకు పూజలు చేసేవారు.

ఈకార్యక్రమంలో భక్తమండలి సభ్యులు కె. సుబ్బరామయ్య, ఈ. ఉపేంద్ర, కె. సతీష్,, యాన్. నల్లయ్య, పాల్గొన్నారు. కార్యక్రమం కు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ బి వి రత్నమయ్య ఆధ్వర్యంలో జరిగింది.

అమ్మవారికి ఊయల సేవ

పామిడి వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా “అమ్మవారి “ఉయ్యాలా సేవ ఘనంగా నిర్వహించారు.

తొలుత ఆలయంలో భక్తులు శివ అభిషేకం, భగవద్గీత పారాయణం, ముకుందమాల పారించారు. కృష్ణ, గోదాదేవి విగ్రహాలకు అష్టోత్తర శతనామ పూజలు చేశారు. మహిళలు లలిత సహస్ర నామపారాయణం చేశారు.

ప్రాకారోత్సవం అమ్మవారికి జరిపారు. మహామంగళ హారతి గావించి తీర్థ, ప్రసాదాలు అందించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*