గ్రహణ సమయంలో అభిషేకం.. ! రికార్డు స్థాయిలో రాహుకేతు పూజలు

గ్రహణ సమయంలో ఆలయాలే మూత వేస్తారు. గ్రహణానికి ముందు వెనుక కనీసం రెండు గంటల పాటు భక్తులను దర్శనానికి అనుమతించరు.

అలాంటిది ఏకంగా గ్రహణ సమయంలోనే అభిషేకం చేయడం విచిత్రం కదూ. అదే శ్రీకాళహస్తీశ్వర ఆలయ మహిమ.

ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాహుకేతు పూజల కోసం జనం ఎగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

సూర్యగ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నింటిని మూసి వేశారు. కానీ, దక్షిణ కాశిగా పేరుపొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది.

అందుకు కారణాలను కూడా ఇంతకు ముందు వార్తలో తెలుసుకున్నాం. గ్రహణ సమయం ప్రారంభం కాగానే ఇక్కడ అయ్యవారికి, అమ్మవారికి గ్రహణకాలాభిషేకం నిర్వహించారు. అలాగే ముగింపులో కూడా గ్రహణకాలాభిషేకం చేశారు.

తెరచి ఉన్న ఏకైక ఆలయం కావడంతో భక్తులు శ్రీకాహస్తికి క్యూ కట్టారు. అంతే కాదు, గ్రహణ సమయంలో రాహుకేతు పూజులు చేయించుకుంటే చాలా మంచిదన్న నమ్మకంతో భక్తులు ఆ పూజలకు ఎగబడ్డారు.

సాధారణంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతుపూజలు రోజుకు రెండు వేలు కంటే ఎక్కువ మంది చేయించుకునే పరిస్థితి ఉండదు.

అయితే సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తితే, వారిలో 5000 మందికి పైనే రాహుకేతు పూజలు చేయించుకున్నారు.

ఆలయ అధికారులు భక్తులకు ఏర్పాట్లు చేశారు. రద్దీని ముందుగానే ఊహించి అందుకు తగ్గట్లుగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

[rl_gallery id=”2125″]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*