తిరుమలకు పోటెత్తిన భక్త సందోహం

తిరుమలలో భక్తుల రద్దీ విపరీంగా పెరిగింది. తిరుమల పట్టణ వీధులన్నీ జనంతో నిండిపోయాయి.స్వామి దర్శనం కోసం వెళ్ళుతున్న భక్తుల క్యూలైన్లు వైకుంఠం కాంప్లెక్స్ దాటి బయటకు వచ్చాయి.

సూర్యగ్రహణం తరువాత టీటీడీ పరిధిలోని ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. అందు భాగంగా తిరుమల ఆలయాన్ని తెరిచారు.

అప్పటికే స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు దర్శనానికి ఎగబడ్డారు. క్యూ కాంప్లెక్స్ లోని అని కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి.

తిరుమల వీధులలో ఎక్కడ చూసినా జనమే జనం కనిపిస్తున్నారు. క్రిస్మస్ సెలవు రావడంతోపాటు వారాంతానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండడంతో జనం తిరుమలకు క్యూ కట్టారు.

గ్రహణం విడిచిన తరువాత ఆలయాన్ని దర్శించుకోవాలనే నమ్మకం ఉండడంతో జనం తిరుమలలో పోటెత్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*