తిరుమల శ్రీవారి ఆలయం సహా టీటీడీ ఆలయాలు మూత..!

సూర్య‌గ్రహణం కారణంగా డిసెంబ‌రు 25వ తేదీన బుధవారం రాత్రి  నుంచి టీటీడీ ఆలయాలన్నీ మూసివేశారు.

తిరుమల శ్రీావారి ఆలయాన్ని 11.00 గంట‌ల‌కు మూసి వేశారు. అధికారులు వెండివాకిలితో సహా ప్రధాన ఆలయాన్ని కూడా మూసి వేశారు. .

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వామివారి ఆలయం,

శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను గురువారం రాత్రే సాధారణ రోజుల్లో మూసివేసే సమయానికి ఆలయాలను మూసేశారు.

గురువారం ఉదయం 8.08 గంట‌ల నుండి ఉదయం 11.16 గంట‌ల వరకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఆలయశుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధ‌వారం రాత్రి 9.00 గంటలకు మూసేశారు. గురువారం మ‌ధ్యాహ్నం 12.00 గంటల తరువాత పద్మావతి అమ్మవారి ఆలయం తలుపులు తెరుస్తారు.

శుద్ధి తదితర కార్యక్రమాలు ముగిసిన తరువాత మ‌ధ్యాహ్నం 3.15 గంట‌ల నుండి భ‌క్తుల‌ను అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రాత్రి  9.00 గంటలకు మూసివేశారు.  గురువారం మ‌ధ్యాహ్నం 12.000  గంటల వరకు తరువాత ఆలయం తెరుస్తారు.

శుద్ధి అనంతరం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో

తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో రాత్రి  9.00 గంటల నుంచి మూసివేశారు. గురువారం మ‌ధ్యాహ్నం 12.000  గంటల తరువాత తెరుస్తారు. మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

శ్రీనివాసమంగాపురం ఆలయంలో

శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి  8.30 గంటలకు మూసి వేశారు.  గురువారం మ‌ధ్యాహ్నం 12.000  గంటల తరువాత ఆలయం తలుపులు తెరుస్తారు.

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

అప్పలాయగుంట ఆలయంలో

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  రాత్రి  8.00 గంటలకు మూసివేశారు. మ‌ధ్యాహ్నం 12.00  గంటలకు తెరిచి మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*