ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి బంగారు డాల‌ర్ల‌ు

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప్ర‌తిమ‌తో కూడిన బంగారు డాల‌ర్ల కోనుగోలుకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేందుకు తొలిద‌శ‌లో శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

ఈ మేరకు సాఫ్ట్‌వేర్ రూపొందించాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఐటి అధికారుల‌ను ఆదేశించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో  కార్యాల‌యంలో బుధ‌వారం ఉద‌యం ఐటి అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప్ర‌తి రోజు వేలాది మంది భ‌క్తులు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న కౌంట‌ర్ల నందు స్వామివారి బంగారు డాల‌ర్లు కొనుగోలు చేస్తున్నార‌న్నారు.

ఇటీవ‌ల‌ ప్ర‌వేశ‌పెట్టిన శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌ల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంద‌ని తెలిపారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌లు ద‌ర్శ‌నం టికెట్లు బుక్‌ చేసుకునే స‌మ‌యంలో బంగారు డాల‌ర్ల‌కు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేసేందుకు వీల‌వుతుంద‌న్నారు.

దాత‌లు తిరుమ‌లకు చేరుకుని ఆల‌యం ఎదురుగా ఉన్నకౌంట‌ర్ల‌లో పొంద‌వ‌చ్చ‌న్నారు. మ‌లిద‌శ‌లో వెండి డాల‌ర్ల‌కు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసేందుకు సాఫ్ట్‌వేర్ రూపొందించాల‌న్నారు.

భ‌క్తులు ఎదురుచూస్తున్న గోవింద మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ల‌తో పాటు పిఒఎస్‌(ఆపిల్‌) ఫోన్ల‌లోను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీల‌వుతుంద‌న్నారు.

ఈ మొబైల్ యాప్ ద్వారా భ‌క్తులు టిటిడి సేవ‌ల‌ను సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌న్నారు.

అదేవిధంగా టిటిడి ప‌రిధిలోని ఆల‌యాల‌కు, ఇత‌ర సంస్థ‌ల‌కు వ‌స్తువుల రూపంలో విరాళాలందించే దాత‌ల సౌక‌ర్యార్థం కైండ్ డొనేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ పేరిట ప్ర‌త్యేక అప్లికేష‌న్ రూపొందించాల‌న్నారు.

ఉద్యోగులకు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు హెచ్ఆర్‌మ్యాప్స్‌లోని స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు ఇఆర్‌పి అప్లికేష‌న్‌ అనుసంధానం చేయాల‌న్నారు.

అనంత‌రం టిటిడి క‌ళాశాల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించిన ఆన్‌లైన్ అడ్మిష‌న్, లీజ్ మ‌రియు రెంట‌ల్ మేనేజ్‌మెంట్‌ సిస్ట‌మ్‌,

డోనార్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, క్యాలెండ‌ర్లు, డైరీలు ఆన్‌లైన్‌ బుకింగ్‌,  టిటిడి వెబ్‌సైట్‌, త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సిఇ శ్రీ రామ‌చంద్రారెడ్డి, అద‌న‌పు ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ ర‌విప్ర‌సాదు, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*