
మనజీవితంలో పుట్టింది మొదలు చచ్చే వరకూ మనకు దిష్టికి దగ్గరి సంబంధం ఉంది. పుట్టినప్పుడు ఇంట్లోకి తీసుకువచ్చేటప్పడు దిష్టి తీస్తారు.
చివరకు పూడ్చే ముందు. పూడ్చిన తరువాత కూడా దిష్టి టెంకాయ కొడతారు.
ప్రత్యేకించి చిన్నపిల్లలు కాస్తంత విసుగ్గా ఉన్న మన అమ్మమ్మలు, అమ్మలు వెంటనే దిష్టి తీస్తారు.
మన జీవితంలో ప్రత్యేకించి చిన్నతనంలో ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుసుకోవాలని ఉందా?
చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దదిష్టిని, పిల్లలకీ విభిన్నపద్ధతులలో తీస్తూ ఉంటారు.
ఇందులో ప్రతీదానికి ఒక అర్థం పరమార్థం ఉంది. శాస్త్రీయపద్దతులను మనకు అలావాటు చేయడానికి మన పెద్దలు నమ్మకం పేరుతో వాటిని మనకు అలవర్చారు.
పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడిపోతారు.
వెంటనే వారికి దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా నీతితో దిష్టి తీస్తుంటారు.
బయట జనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.
ఇందుకు ఒక కారణం కూడా ఉంది.
చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా సరే వేడుకల్లో పాల్గొనప్పుడు చుట్టూ జనం చేరుతారు. సహజంగా ఊపిరి సరిగా సలపక కొంత అస్వస్థతకు గురిఅవుతారు.
అందుకే వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుందని అర్థం
Leave a Reply