సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
మధ్యాహ్నం 1.30 గంటల నుండి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
డిసెంబరు 26న ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.
ఈ కారణంగా డిసెంబరు 25న బుధవారం రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయ తలుపులు మూస్తారు.
తిరిగి డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు.
శుద్ధి, పుణ్యహవచనం అనంతరం ఏకాంతంగా సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన చేపడతారు. మధ్యాహ్నం 1.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26వ తేదీ ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలతోపాటు సుప్రభాతం, అర్చన, తిరుప్పావడ, కల్యాణోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాలను గమనించగలరని కోరడమైనది.
Leave a Reply