తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురము -3 అర్థమేంటి?

3.పాశురము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం

నోము అని పేరుపెట్టి, మేము చేస్తున్న ఈ వ్రతములో, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి, లోకములన్నిటిని వామనుడై కొలిచిన ఆ పురుషోత్తముడి దివ్య నామములను అందరము కలిసి, ఒక చోటనే వుండి కీర్తిస్తూ…

పూజించడం వలన, దేశములో చెడు అన్న మాట ఒక్కటి కూడా లేకుండా పోవడంతో, నెలకు మూడు సార్లు వానలు కురుస్తూ, పచ్చని పంటచేలతో సస్యశ్యామలమై…

ఆ పంటల నడుమన వున్న నిండు నీటి చెరువులలోని చేపలు ఎగిరెగిరి త్రుళ్లిపడుతుండగా, అందమైన ఎర్రని తామర పువ్వుల రేకల మీద, చల్లని పిల్లగాలికి అందమైన తుమ్మెదలు నిద్రిస్తుండగా….

గుంపులు గుంపులుగా వున్న సాథుస్వభావపు ఆవులు పచ్చిక బయళ్లలోని పచ్చగడ్డిని కడుపారా తిని, నిండైన పొదుగులతో, మెడలోని గంటలు ఘల్లుఘల్లుమని సవ్వడి చేస్తూ, ఇళ్లకు వెళ్లి….

పెద్ద పెద్ద కుండల నిండా పాలను ఇస్తూ ఉండడం వలన, ఏ కొరత లేని అష్టైశ్వర్యములతో దేశము అభివృద్ది చెందుతుంది

అని అంటూ, మనము చెయ్యాలి అని అనుకునే పని వలన కలిగే లాభము గురించి మనకు ముందుగా తెలిసి వుండాలి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*