ధనుర్మాసంలో ధానం చేయాలా? తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురము -2

వైఖానసంలో తిరుప్పావైకి ప్రత్యేకంగా ఒక నెలనే కేటాయించేశారు. విష్ణు అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణుడిని కొలుస్తూ గోదాదేవి చేసిన తిరుప్పావై సమస్త జనావళికి సందేశాన్ని ఇస్తుంది.

ఆకలితో ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లు పట్టెడు అన్నం పెట్టాలని, కష్టాల్లో ఉండి యాచించి వచ్చిన సాధువులు, ఇతరులకు వారికి ధనం, దాన్యం దానం చేయడం వలన ఈ జన్మలోనే మోక్షం లభిస్తుందని చెబుతుంది.

పాశురము -2

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

తెలుగులో అర్థం

ఈ లోకములో, ఈ మానవ జన్మలోనే, తరించాలి అని తహతహలాడే మానవు లారా, మేము చేసే మా నోములోని నియమములను వినండి.

తెల్లవారుఝామునే నిద్ర లేచి, స్నానము చేసి, ఆ క్షీరాబ్ది యందు ఆదిశేషుడిపై యోగనిద్ర పోతున్న ఆ సర్వేశ్వరుడి దివ్య పాదపద్మములను పూజించి, సేవిస్తాము.

మేము ఆ స్వామిని పూజించకుండా కాటుకతో మా కంటిని అలంకరించుకోము, పువ్వులను తలలో పెట్టుకోము. ముందుగా మేము చేసేది ఆ స్వామి పూజ మాత్రమే, ఆ స్వామిని కీర్తించి కాని మేము ఏ పని చెయ్యము.

నేతితో చేసినవి కాని పాలతో చేసినవి కాని ముందుగా వేటిని తినము. పెద్దలు చెయ్య వద్దని చెప్పిన పనులను ఎప్పుడూ చెయ్యము. చెడ్డ మాటలు చెప్పము.

సరి అయిన విధముగా, జ్ఞానము కలిగిన సాధువులకు, బిచ్చగాండ్లకు దానధర్మములను చేస్తూ, ఈ మానవ జన్మలోనే తరించే మార్గమును వెతుకుతూ, సంతోషముగా ఆ దారిన నడిచెదము, అని అంటూ, మనము ఏ పనిని చెయ్యాలి అని అనుకున్నామో, ఆ పనిని ఏ విధముగా చెయ్యగలగాలో మనకు తెలిసి ఉండాలి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*