పామిడి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు

ధనుర్మాసం పురస్కరించుకొని పామిడి లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో ఘనంగా నిర్వహించారు .

అందులో భాగంగా శుక్రవారం అమ్మవారి ఉత్సవవిగ్రహాన్ని పల్లకిలో ఉంచి ప్రాకారోత్సవం నిర్వహించారు.

ఈసందర్బంగా భగవద్గిత పారాయణం, లలితాసహస్ర నాపరాయణం, ప్రార్థన మంజరి పఠించారు.

శ్రీకృష్ణ విశ్వరూప సందర్శన చిత్రాలకు కృష్ణ అష్టోత్తర శతనామ పూజలు జరిపారు.

శివునకు రుద్రాభిషేకంచేసారు. అమ్మవారిని ఊయలలో ఉంచి మహిళలు భక్తి గేయాలు ఆలపించారు.

మహామంగళహారతి గావించి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*