గోవును పూజించి గోవిందుడిని ద‌ర్శించ‌డం ఉత్త‌మం :విశాఖ శార‌ద పీఠాధిప‌తి  స్వ‌రూపానందేంద్ర‌స్వామి

గోవుల‌ను పూజించిన త‌రువాత తిరుమ‌ల‌లో గోవిందుడిని ద‌ర్శించుకోవ‌డం ఎంతో ఉత్త‌మ‌మైంద‌ని విశాఖ శార‌ద పీఠాధిప‌తి  స్వ‌రూపానందేంద్ర‌స్వామి ఉద్ఘాటించారు.

తిరుప‌తిలోని అలిపిరిలో నిర్మాణంలో ఉన్న స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణశాల‌ను గురువారం సాయంత్రం విశాఖ శార‌ద ఉత్త‌ర పీఠాధిప‌తి స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామితో క‌లిసి స్వామీజీ సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా  స్వ‌రూపానందేంద్ర‌స్వామి మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు వాహ‌నాల్లో వెళ్లేవారుగానీ, న‌డిచి వెళ్లే భ‌క్తులు గానీ అలిపిరి వ‌ద్ద గోపూజ చేసుకునేందుకు వీలుగా స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణశాల శిలా క‌ట్ట‌డాన్ని టిటిడి నిర్మించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

శాస్త్రం ప్ర‌కారం గంగ, గోవు, గోవిందుడు… అంటార‌ని తెలిపారు. ఈ నిర్మాణానికి విరాళం అందించిన టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డికి స్వామివారి ఆశీస్సులు ఉంటాయ‌న్నారు. ఇందుకు కృషి చేసిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డిని అభినందించారు.

అనంత‌రం గోవిజ్ఞాన‌కేంద్రం, గో తులాభారం, గోస‌ద‌న్‌ను స్వామీజీలు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గోప్ర‌ద‌క్షిణ‌శాల‌లో గోపాల‌కృష్ణుని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*