మహా అపచారాలు చేశారా? అయితే ఈ ఆలయాన్ని దర్శించండి.

తెలిసో తెలియకో ప్రతి ఒక్కరు తప్పులు చేయడం సహజం. చేసిన తప్పును తెలుసుకుని దేవుణ్ణి శరుజొచ్చడం, సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

మహా అపచారం చేసి వాటిలో దానికి పరిష్కారం తెలియక పశ్చాత్తాపడుతుండే వారు ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి అనుకునే వారి కోసం ఈ వార్తాకథనం.

ప్రతీ ఆలయానికి ఓ చరిత్ర ఉంటుంది. అక్కడ ఆ దేవుడు వెలసడానికీ ఓ కారణం ఉంటుంది.

చెన్నయ్ జిల్లాలో పొన్నేరీకి 3 కి.మీ. దూరంలో చిన్న కవనంలో వెలసిన చతుర్వేదపురంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రానికి కూడా ప్రాముఖ్యత ఉంది.

దీనిని అంకోలా గణపతి ఆలయం అంటారు. ఇక్కడ కొలువై ఉన్న స్వామి చతుర్వేదేశ్వరుడు. మన పురాణాల ప్రకారం శివుని ఆదేశాల మేరకు అగస్త్య మహాముని 108 రోజులు 108 సైతక లింగాలను ప్రతిష్టించారట.

చివరి రోజున లింగాలన్ని ఏకమై గణపతి రూపంగా మారాయట. ఆశ్చర్యపోయిన అగస్త్యునకు మహేశ్వరుడు దర్శనమిచ్చి ‘నీవు ముందుగా గణపతి పూజ చేయని కారణంగా ఇలా జరిగింద’ని చెప్పారట.

కానీ, ఈ దేవుడు కలియుగాంతం వరకూ నిలిచి భక్తుల కోరికలు తీర్చుతాడని వివరించారట. ఆపై అగస్త్య మహా ముని తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని చతుర్వేదేశ్వర స్వామి లింగానికి తోడుగా మరో లింగాన్ని ప్రతిష్టించి ప్రాయశ్చితం చేసుకున్నాడట.

నూటెనిమిది సైతక లింగాలను ప్రతిష్టించిన తరువాత దీనిని ప్రతిష్టించడం వలన దీనికి నూట్రేశ్వర స్వామి అని పేరు స్థిరపడింది.

ఇక్కడి స్వామిని పూజించి వడమాల సమర్పిస్తే తెలిసీ తెలియక చేసిన తప్పులను తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*