భారతదేశ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కె సింగ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఉదయం విరామసమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు.
అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు స్వాగతం పలికారు.
బుధవారం సాయంత్రం తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. గురువారం ఉదయం తిరుమలలో స్వామివారిని దర్శనానికి విచ్చేశారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్ర నాథ్ రెడ్డి కూడా ఆయనతో పాటు దగ్గరుండి శ్రీవారి దర్శనం కలిగించారు.
తరువాత రంగనాయక మండపంలో వేదపండితులతో ఆశీర్వచనం పొందారు.
Leave a Reply