తిరుమల బస్ టికెట్లు…. తీసుకుంటే షాకే

ఏపీఎస్ ఆర్టీసీ శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు షాక్ ఇచ్చింది. తిరుపతి, తిరుమలకు మధ్య నడిచే బస్సులలో టికెట్ల ధరలను అమాంతం పెంచేసింది.

తిరుపతి నుంచి తిరుమలకు ప్రధానంగా ఐదు చోట్ల నుంచి బస్సులు ప్రయాణమవుతాయి. ఒకటి ఏడుకొండల బస్టాండు, రెండు రైల్వే స్టేషన్, మూడు శ్రీనివాసం, నాలుగు మాధవం, ఐదు అలిపిరి వద్దనున్న బాలాజీ బస్సు స్టేషన్ నుంచి బస్సులు ప్రయాణమవుతాయి.

ఇవి కాకుండా రేణిగుంట ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల నుంచి కూడా వెళ్ళతాయి. సాధారణంగా ఈ బస్సు టికెట్లు ఒకప్పుడు పెద్దలకు రూ. 45/-, పిల్లలకు రూ. 23/- గా ఉండేది. ఆ తరువాత మరోమారు టికెట్ల ధరలను పెంచింది.

ఇటీవల ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసింది. ఆ పెంచిన ధరలు సామాన్య భక్తులకు షాక్ కొట్టేలా ఉన్నాయి. పెద్దలకు రూ. 65/- రూపాయలు, పిల్లలకు రూ. 40/-గా నిర్ణయించింది.

Tirumala, Bus tickets, Tirumala bus Tickets, తిరుమల, బస్సు టికెట్లు,

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*