సౌరమానానికి, మనకూ సంబంధం ఉందా ? ధనుర్మాసము విశిష్ట ఏమిటి ?

నేడైతే రకరకాల గడియారాలు. ఇతర ఎటక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. కానీ, గతంలో కాలాన్ని ఎలా గుర్తించేవారు అంటే మొదట గుర్తొచ్చేది సూర్యుడి గమనం.

సూర్యోదయం, సూర్యాస్తమయాలను రకరకాలుగా విభజించి కాలాన్ని లెక్కగట్టేవారు. అయితే భారత ఖగోళ శాస్త్రం చాలా పురాతనమైనది. మన పురాణాలతో దీనికి సంబంధం ఉంది.

ఆ సూర్య గమనాన్ని అనుసరించి కాలాన్ని కొలిచే వారు. రోజులను, నెలలను కూడా కొలిచే వారు. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి.

చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు .

ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు .

కర్కాటకరాశిలో సూర్యుడు సంచరించే కాలాన్ని కర్కాటకమాసము అంటారు. ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు.

మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజుతో సమానం. మనం పగలు, రాత్రిని ఏ విధంగా లెక్కిస్తారో. దేవతలు సూర్యుడు ఉత్తర, దక్షిణాయనాలను రాత్రింబవళ్లుగా భావిస్తారు.

సూర్యుడు కర్కటకరాశిలో ఉంటే దక్షిణాయనం అవుతుంది. ఇది రాత్రి కాలం అన్నమాట మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.

అంటే దేవతల రోజు(మనకు ఏడాది) పగలుగా భావిస్తారు. దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణంలో తొలత వచ్చేది. ధనుర్మాసం. అంటే ప్రాతఃకాలమంతటి వలె పవిత్రమైనది.

సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే.

మహలక్ష్మి కరుణాకటాక్షాలు లభిస్తాయి.

సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు.

ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.

ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయిన మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజిస్తే వెయ్యేళ్ళువిష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*