చర్మవ్యాధులను నివారించే ఆలయం ఉందా? ఎక్కడ?

కొంత మంది చర్మవ్యాధులతో బాధపడుతుంటారు. తమ వ్యాధులను తగ్గించుకోవడానికి కలవని డాక్టర్ ఉండడు. మొక్కని దేవుడు ఉండడు. కానీ, ఆ ఆలయం మాత్రం దర్శించి ఉండరు.

ఆ ఆలయాన్ని దర్శిస్తే చర్యవ్యాధులు ఇట్టే మాయమవుతాయట. ఏదా ఆలయం? ఎక్కడుంది. తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండీ.

తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణానికి ఐదు కిలోమీటర్ల దూరాన తిరునాగేశ్వరంలో ఓ ఆలయం ఉంది. దీనిపేరు ఒప్పిలియప్పన్ ఆలయం అంటారు. ఇది మార్కెండేయ క్షేత్రమని ప్రసిద్ధికెక్కింది.

ఇక్కడ భూమిదేవి మార్కెండేయునికి తులసివనంలో కనిపించిందట. అందుకే దీనిని తులసి క్షేత్రం అని కూడా పిలుస్తారు. అందుకే ఇక్కడ భూమి దేవి లేకుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని బయటకు కదిలించరు.

మరో విశేషం ఏమిటంటే పుష్కరిణీలో రాత్రిపగలు తేడా లేకుండా ఎప్పుడైనా స్నానం చేయవచ్చు. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటైన ఇక్కడ ఒక ఆచారం ఉంది.

ఉప్పు, మిరియాలతో కూడిన మిశ్రమాన్ని భక్తులు గరుడస్వామికి నివేదిస్తారు. ఇలా చేయడం వలన చర్మసంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*