శ్రీవారి ఆలయంలో శోభాయ‌మానంగా కార్తీక దీపోత్సవం

తిరుమల శ్రీవారి అలయంలో బుధ‌వారం సాయంత్రం కార్తీక ప‌ర్వ‌దీపోత్సవం ఘనంగా జ‌రిగింది. కార్తీక పౌర్ణ‌మినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నులపండుగగా నిర్వ‌హించారు.

కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప‌క్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్ల‌లో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు.

తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.

ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా,

తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి దీపాలు వెలిగించారు.

ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం,

స్వామి పుష్కరిణి వ‌ద్ద నేతిజ్యోతులను మంగళవాయిద్యాల న‌డుమ‌ వేదమంత్రోచ్ఛారణతో ఏర్పాటు చేశారు.

ఈ కార్తీక దీపోత్సవంలో టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*