డిసెంబరు 11న తిరుచానూరులో వనమహోత్సవం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 11వ తేదీ బుధ‌వారం వన మహోత్సవం ఘనంగా జరుగనుంది.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు న‌వంబ‌రు 23 నుండి డిసెంబరు వ1వ తేదీ వరకు ఘనంగా జరిగాయి.

ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతమైనందుకు గాను వన మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆలయం వద్దగల శుక్రవారపుతోటలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు శ్రీపద్మావతి అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

ఆ తరువాత మహా నివేదన, వనమహోత్సవంలో భాగంగా ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ చేస్తారు.

బ్రహ్మోత్సవాల్లో సేవలందించిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*