వృద్ధులు,చంటిపిల్లలున్నారా? ఈ రోజుల్లో తిరుమల దర్శనం సులభం

తిరుమల తిరుపతి దేవస్థానం దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు దర్శనం కలిగించే రెండు రోజుల కోటాను విడుదల చేసింది.

ఈ మధ్యకాలంలో లో టీటీడీ నాలుగు రోజులపాటు వీరికి ప్రత్యేక ప్రవేశ దర్శనం కనిపిస్తోంది.

సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

కానీ, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను డిసెంబ‌రు 11, 18వ‌ తేదీల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

వృద్ధులు వికలాంగులకు కూడా…

వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే.

వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, డిసెంబ‌రు 17వ తేదీన వయోవృద్ధులు (65 సం. పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది.

ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు.

భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*