చ‌క్ర‌తీర్థ ముక్కోటి అంటే ఏమిటి? తిరుమలలో ఎందుకు నిర్వహిస్తారు.?

తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల‌లో ఒక్క‌టైన చక్రతీర్థ ముక్కోటి. డిసెంబ‌రు 9న సోమ‌వారం ఘనంగా నిర్వహంచనున్నారు.

దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడు ఎందుకు నిర్వహిస్తారు.? ఎక్కడ నిర్వహిస్తారు ?

పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసివున్న శేషగిరుల మీద దక్షిణ భాగంలో మహా పవిత్రతీర్థమైన చక్రతీర్థం ఉంది.

స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు.

అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు.

పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు.

అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు.

భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.

ఆ రోజు ఏం చేస్తారు? 

ప్రతి ఏడాది తమిళ కార్తీక మాసం శుద్ధ ద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది.

వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా వెలుగొందుతోంది.

అందుకే ఆ రోజున ఉద‌యం 9.00 గంట‌ల‌కు స్వామివారు అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు మరియు యాత్రికులు మంగళ వాయిద్యాలతో స్వామివారి ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు.

చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారు వారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు పూజ‌లు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*