తిరుమల బూందీ పోటులో అగ్ని ప్రమాదం(వీడియో)

తిరుమల బూందీ పోటులో ఆదివారం ఉదయం ప్రమాచం చోటు చేసుకుంది. ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టారు.

పోటులోని పొయ్యిలుమంటల్లో చిక్కుక్కున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

శ్రీవారి ఆలయం వెలుపల గల అదనపు బూందీ పోటులో బూందీ తయారీ క్రమంలో పోటు కార్మికుడు 19వ నంబరు పొయ్యి బాణలిలో నెయ్యి నింపుతున్నాడు.

ఈ క్రమంలో పొరపాటున నెయ్యి డబ్బా జారి పొయ్యి పై పడింది.

అప్పటికే పొయ్యి వేడెక్కి ఉండడంతో కిందపడ్డ నెయ్యి రగులుకుంది. చెలరేగిన మంటలు బ్లోయర్ ద్వారా బయటకు వ్యాపించాయి. అలదట్టమైన పొగ వెలువడింది.

దీంతో కార్మికులు బూందీ పోటు నుంచి బయటకు పరుగులు పెట్టారు.

దట్టమైన పొగలు తిరుమల ఆకాశాన్ని ఆవరించాయి. బయట నుంచి చూస్తున్న భక్తులు కూడా కొంత భయపడ్డారు.

అక్కడున్న సాంకేతిక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించారు.

ఈ లోపు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి అపాయం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు.

ఈ కారణంగా పోటును శుభ్రం చేయాల్సి రావడం వల్ల 20 పొయ్యిలను తయారీకి దూరంగా ఉంచడం జరిగింది. ఇది స్వల్ప ప్రమాదమేనని ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని టీటీడీ వివరణ ఇచ్చింది.

అనతి కాలంలోనే బూందీ తయారీని ప్రారంభిస్తామని చెప్పారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*