ఈ సేవాటికెట్లకు ఎవ్వరి సిఫారస్సు అక్కర లేదు. దరఖాస్తు చేసుకోండి

2020 మార్చి తిరుమల సేవాటికెట్ల కోటా విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ సేవలకు సంబంధించిన 2020 మార్చి ఆన్‌లైన్‌ బుకింగ్ కోటాను విడుదల చేసింది. దరస్తు చేసుకోవాలనుకునే వారు టీటీడీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆ సేవలను పొందవచ్చు.

ఈ కోటా కింద విడుదల చేసిన సేవా టికెట్లకు ఎవ్వరి రికమండేషన్ అవసరం లేదు. ముందుగా ప్లాన్ చేసుకుంటే చాలు టికెట్లను పొంది సేవ చేసుకునే అవకాశం  పొందవచ్చు.

తిరుపతి దేవస్థానం మొత్తం 52,748లను ఆన్‌లైన్‌లో పెట్టింది.

ఆన్‌లైన్‌ డిప్(లాటరీ) కేటగిరి 10,973లను విడుదల చేసింది.

సుప్రభాతం 8,193, తోమాల సేవ 120, అర్చన 120, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లను కేటాయించారు.

సాధారణ కేటగిరిలో కేటాయించిన టికెట్లు – 41,775

కళ్యాణం – 14,250 , ఊంజలసేవ – 4500, ఆర్జిత బ్రహ్మోత్సవం 7, 425 , సహస్ర దీపాలంకరణ 15,600 టికెట్లను విడదల చేశారు.

వీటన్నింటిని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

బుక్ చేసుకోవడానికి లింకు

https://ttdsevaonline.com/#/login

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*