తిరుమలలో గిరి ప్రదర్శన…! ఓ భక్తుడు అందించిన ఆలోచన…!!

డయల్ యువర్ ఈవోలో మరిన్ని విశేషాలు

కలియుగదైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండ చుట్టూ గిరిప్రదర్శన ఏర్పాటు చేస్తే బాగుటుందని, ఆ దిశగా అడుగులు వేయాలని ఓ భక్తుడు అందించిన ఆలోచనకు టీటీడీ సానుకూల సమాధానం ఇచ్చారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది.

ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమాధానాలు ఇచ్చారు.

స‌ప్త‌గిరుల చుట్టూ గిరి ప్ర‌ద‌క్షిణ కోసం బాట వేసే విధంగా ఆలోచన చేయాలని చీపురుప‌ల్లికు చెందిన సుధాక‌ర్‌రావు కోరారు.

అలాగే టిటిడికి విరాళ‌మిచ్చే దాత‌ల‌కు స్వామివారి అక్షింత‌లుగానీ, పుస్త‌క ప్ర‌సాదం గానీ పంపించే పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు.

దీనిపై ఈవో మాట్లాడుతూ, రెండు సూచనలు బాగున్నాయని, గిరిప్రదర్శనకు ఉన్న అవకాశాలను అధికారుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని చెప్పారు. .

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌క్క‌న రోడ్డుపై మాంసాహారం విక్ర‌యించ‌కుండా చూడాలని తిరుపతికి చెందిన తిరుప‌తికి చెందిన నాగేంద్ర‌ప్ర‌సాద్ కోరారు.

ఈ విష‌యాన్ని కార్పొరేష‌న్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి మార్గం చూస్తామని ఈవో తెలిపారు.

తిరుప‌తిలోని విష్ణునివాసంలోనూ కొన్ని గ‌దుల‌కు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలని, శ్రీ‌నివాసంలో గ‌దులు కేటాయించే స‌మ‌యాన్ని మార్చాలని విశాఖకు చెందిన మోహన్ రావు, విజయవాడకు చెందిన వంశీ గుంటూరుకు చెందిన భావ‌నారాయ‌ణలు కోరారు.

శ్రీ‌నివాసం, విష్ణునివాసంలో 50 శాతం గ‌దుల‌కు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం ఉందని తెలిపారు. ఇక సమయపాలన విషయంలో మెజారిటీ భ‌క్తుల అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని శ్రీ‌నివాసంలో గ‌దులు కేటాయించే స‌మ‌యాన్ని మారుస్తామని ఈవో చెప్పారు.

రూ.300/- భ‌క్తుల‌ను ధ్వ‌జ‌స్తంభాన్ని తాక‌నివ్వండి. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు కూడా సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ అమ‌లుచేయండి హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస రావు కోరారు.

భ‌క్తుల కోరిక మేరకు గ‌తంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఆల‌యం వెలుప‌ల ఫోన్లు పెట్టే విష‌యాన్ని ప‌రిశీలిస్తాం.

భ‌క్తులంద‌రూ ధ్వ‌జ‌స్తంభాన్ని తాకేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తామని చెప్పారు. సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణచడ భ‌క్తుల అభిప్రాయాల‌ను సేక‌రించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు

టైంస్లాట్ ద‌ర్శ‌నం భ‌క్తుల కోసం నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల మొద‌ట్లో ల‌గేజి కౌంట‌ర్ ఏర్పాటు చేయాలని తిరుపతికి చెందిన ప్రసాద్ కోరారు.

అన్ని దర్శనాలకు ఒకే చోట ప్రవేశం కల్పించి లగేజీ కౌంటరును ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నామని ప‌రిశీలించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటామని ఈవో తెలిపారు.

బ‌్ర‌హ్మోత్స‌వాల్లో వ‌ర్షం ప‌డ‌డం వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డాం. గ్యాల‌రీల్లో షెడ్లు ఏర్పాటు చేయాలని మదనపల్లెకు చెందిన వెంకట్రామాచారి అడిగారు.

వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డం వ‌ల్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో షెడ్లు వేయ‌లేక‌పోతున్నామని, దీనిపై అధ్య‌య‌నం చేస్తున్నామని ఈవో సమాధానం చెప్పారు.

గదుల కోసం మ‌హిళ‌లకు ప్ర‌త్యేక క్యూ ఏర్పాటు చేయాలని నెల్లూరుకు చెందిన కామాక్షి కోరారు.

భ‌క్తులు క్యూలో వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా ముందుగా న‌మోదు చేసుకునే విధానం ఉంది. ఈ ప్ర‌కారం సంబంధిత భ‌క్తుల‌కు ఎస్ఎంఎస్ ద్వారా గ‌ది కేటాయింపు స‌మాచారం తెలియ‌జేస్తారని అన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*