పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లు : ఈవో

పర్వదినాలలో  విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు  తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 6న వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు :

– జనవరి 6న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమలకు విచ్చేసే భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.

భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు చేస్తాం.

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో సుమారు 10 వేల మందికి స‌రిప‌డా నూత‌న షెడ్లు అందుబాటులోకి తీసుకొస్తాం.

ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపు నిలుపుదల :

– నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలను, గదులను కేటాయించడం లేదు.

– డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు కేటాయించడం లేదు.

డిసెంబరు 7న గీతాజయంతి :

– డిసెంబరు 7న 10 వేల మంది విద్యార్థులతో తిరుపతిలో గీతాజయంతి నిర్వహిస్తాం.

రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

టిటిడి డైరీలు, క్యాలెండర్లు  :

– 2020 టిటిడి క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి.

అదేవిధంగా, క్యాలెండర్లు, డైరీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిటిడి సమాచార కేంద్రాల్లో డిసెంబరు 10వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి.

బాలాజి రిజర్వాయర్‌ :

– తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. ఇందుకోసం అంచనాలను రూపొందిస్తున్నాం.

           అనంత‌రం ఈ ఏడాది ఏప్రిల్ నుండి న‌వంబ‌రు నెల వ‌ర‌కు న‌మోదైన హుండీ ఆదాయం, బంగారం, వెండి విరాళాలు, వివిధ ట్ర‌స్టుల‌కు వ‌చ్చిన విరాళాలు, జ‌లాశ‌యాల్లోని నీటి నిల్వ‌ల‌ను ఈవో తెలియ‌జేశారు.

దర్శనం :

– గతేడాది న‌వంబ‌రులో 20.93 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది న‌వంబ‌రులో 21.16 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది న‌వంబ‌రులో రూ.86.77 కోట్లు కాగా, ఈ ఏడాది న‌వంబ‌రులో రూ.93.77 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది న‌వంబ‌రులో 45.47 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది న‌వంబ‌రులో 44.73 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు :

– గతేడాది న‌వంబ‌రులో 90.89 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది న‌వంబ‌రులో 99.94 ల‌క్ష‌ల లడ్డూలను అందించాం.

గ‌దులు :

– గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది న‌వంబ‌రులో 104 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది న‌వంబ‌రులో 106 శాతం న‌మోదైంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*