
తిరుపతి చుట్టు పక్కల ఉన్న ఆలయాలను ఒకే రోజులో దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి? అది సాధ్యమవుతుందా? సాధ్యమైతే ఎలా? ఇలాంటి సందేహాలు చాలానే ఉంటాయి. వాటన్నింటిని నివృత్తి చేయడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నమిది.
తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం కదా వేంకటేశ్వర స్వామికి అనుబంధంగా చాలా ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ తిరుపతికి కొంత పరిధిలో ఉంటాయి. వాటిన్నింటిని చూడాలంటే చాలా మందికి వీలుపడదు. ఏ బస్సు ఎక్కాలో? ఎక్కడి వెళ్ళాలో తెలియదు.
మరికొందరైతే తిరుగు ప్రయాణంలో బస్సుల సమయం మించిపోతుందని జంకుతుంటారు. ఇలాంటి వారి సమయాలకు అనుగుణంగా ఏపి టూరిజం శాఖ స్థానిక ఆలయాల సందర్శన కోసం కొన్ని బస్సులను నడుపుతోంది.
తిరుపతి బస్టాండుకు ఎదురుగా ఉన్న శ్రీనివాసం భక్త సముదాయం, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం నుంచి ఈ బస్సులను నడుపుతారు. అక్కడ నుంచి స్థానికంగా ఉన్న ఆలయాలను రెండు విభాగాలుగా విభజించారు.
సమీపంలో ఉన్న ఆలయాలను దర్శించుకునేందుకు నాలుగు ట్రిప్పుల బస్సులు తిరుగుతాయి. ప్రతీ ప్రయాణీకుడికి వంద రూపాయలు చెల్లిస్తే చాలు. వారే తీసుకెళ్ళి అన్ని ఆలయాల దర్శనం చేయించి తిరిగి అదే చోట వదులుతారు.
ఈ టూర్ కింద వచ్చే ఆలయాలు
1. పద్మావతీ అమ్మ(అలమేల్ మంగ) వారి ఆలయం. తిరుచానూరు
2. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం.
3. అగస్తీశ్వర స్వామి వారి ఆలయం, తొండవాడ.
4. కపిలేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం
5. కోదండరామ స్వామి ఆలయం, తిరుపతి.
6. గోవింద రాజస్వామి ఆలయం, తిరుపతి.
కొద్దిగా దూరం ఉన్న ఆలయాల కోసం. వీటిని కూడా రోజులో దర్శనం చేసుకుని తిరిగి రావచ్చు. శ్రీనివాసం నుంచి ఉదయ 9, 10 గంటలకు రెండు ట్రిప్పుల బస్సులు నడుస్తాయి. అవి వివిధ దేవాలయాలకు భక్తులన తీసుకెళ్ళి తిరిగి తీసుకు వచ్చి అదే ప్రాంతంలో వదులతాయి.
1. వేణుగోపాల స్వామి ఆలయం, కార్వేటి నగరం,
2. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం.
3. పల్లికొండేశ్వర స్వామి ఆలయం, సురుటు పల్లె.
4. వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం.
5. కరియ మానిక్య స్వామి ఆలయం, నగిరి.
6. కాశీవిశ్వేశర స్వామివారి ఆలయం, బుగ్గ,
7. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట.
Leave a Reply