వేంకటేశ్వర స్వామికి భార్యలు ఒకరా..? ఇద్దరా..? నిజమైన భార్య ఎవరు?

వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. ఇది లోకానికి తెలిసిన విషయం. వారి పేర్లు కూడా చెబుతాం. ఒకరు శ్రీదేవి, మరొక్కరు భూదేవి. అందులో సందేహం ఎందుకు? అని ప్రశ్నించే వారు ఉంటారు.

కానీ, వేంకటేశ్వర స్వామికి ఒకరే భార్య. మరి అలా అయితే ఆ ఒక్క భార్య ఎవరు? అసలేంటి కథ. తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అందుకే ఈ కథనం.

వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు అంటారు. వారిలో ఒకరేమో శ్రీదేవి మరోకరు భూదేవి అని మనకు తెలుసు. శ్రీదేవి… ఆమె లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంపై కుడివైపున ఉంటుంది.

మరి ఎడమ వైపున ఉన్నది ఎవరు? భూదేవే కదా? ఆమె ఆయన భార్యే కదా? అంటే అవునని అనుకుంటాం. కానీ, వేంకటేశ్వర స్వామి ఏక పత్నీవ్రతుడట. శ్రీదేవి మాత్రమే ఆయన భార్య.

నిజరూప దర్శనంలో శ్రీదేవి మాత్రమే కనిపిస్తుందట. భూదేవి కనిపించదట. చిత్రాన్ని గీచేవారు బొమ్మలో చిత్రంలో సమానత్వాన్ని చూపడానికే అలా గీచారని చెబుతారు.

కలౌ వేంకట నాయకా.. అంటే భూమికి అధిపతి అని అర్థం. భూమిని రక్షించవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది. పోషించే బాధ్యత కూడా ఆయనదే. భూమి పండించగలగే శక్తిమంతుడు ఆయన.

కాబట్టి ఆయనకు లక్ష్మిదేవిని భార్యగా చెబుతారు. ఆయన భార్య కాబట్టి భూ లక్ష్మి లేదా భూదేవి అని అంటారు.

వాస్తవానికి శ్రీదేవి తిరుచానూరు నుంచి వచ్చి వేంకటేశ్వర స్వామి వక్షస్థలంపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతారు. మరి రెండవ వైపున ఉన్న భూదేవి ప్రస్తావన పెద్దగా కనిపించదు.

అందుకే శ్రీదేవి మాత్రమే వేంకటేశ్వర స్వామి హృదయ లక్ష్మి. ఆమె శ్రీదేవి. భూదేవి భార్య కాదు అని కొన్ని పురాణాలను ఆధారం చేసుకుని కొందరు పండితులు చెబుతున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*