అలమేలు మంగ వడ్డాణం బరువెంతో తెలుసా…!

తిరుచానూరులో వెలసిన పద్మావతీ(అలమేలు మంగ) అమ్మవారు చక్రస్నానం సందర్భంగా ధరించే వడ్డాణం బరువెంతో తెలుసా.. దానిని ఎవరు ఇస్తారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.

తిరుమలకు తిరుచానూరుకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది. ఎందకంటే అయ్యవారు(శ్రీవారు) తిరుమలలో కొలువై ఉంటే, అమ్మవారు(అలమేలు మంగ) తిరుచానూరులో కొలవై ఉన్నారు.

ఈ రెండు దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్వహిస్తుంది. తిరుచానూరులో బ్రహ్మోత్సవాలంటే విశేష ఆభరణాలు కొండ దిగి రావాల్సిందే. చివరకు అయ్యవారి పాదాలు కూడా దిగి వచ్చి ఇక్కడ ఊరేగుతాయి.

బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అమ్మవారు విశేష అలంకరణ ఉంటుంది. అమ్మవారు దేదీప్యమానం వెలిగి పోతుంటారు. అదే రోజు అమ్మవారి వడ్డాణం బహుకరణ జరిగింది.

మేలిమి బంగారంతో చేయించబడ్డ ఈ వడ్డాణం బరువెంతో తెలుసా..! అక్షరాలా 1 కిలో 300 గ్రాములు. స్వామి సంస్థ తరుపు నుంచి వచ్చిన ఈ ఆభరణాన్ని ధరించి అమ్మవారు మురిసిపోతారట.

ఈ ఆభరణాన్ని తీసుకువచ్చే ఊరేగింపు పండుగలా జరుగుతుంది. ఆ ఆభరణాన్ని మీరు చూడండి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*