అమ్మో….! తిరుమలలో ఎంత పెద్ద పామో…!! చూశారా? (వీడియో)

తిరుమలలో ఓ పెద్ద పాము సోమవారం హల్ చల్ చేసింది. భక్తులు జనం పరుగులు పెట్టారు. ఎంత పెద్ద పామంటే అంత పెద్ద పాము.

దాదాపు 11 అడుగుల పాము ఏకంగా నడి తిరుమలలోకి వచ్చేసింది. వివరాలిలా ఉన్నాయి.

తిరుమల దట్టమైన అరణ్యంలో ఉంది. అక్కడ పెద్ద పెద్ద సర్పాలు, చిరుతలు, రకరకాల జంతువులు నివాసం ఉంటాయి. అయితే సోమవారం మధ్యాహ్నం తిరుమలలోని లేపాక్షి సర్కిల్ సమీపంలోని ఓ దుకాణంలోకి ఓ పాము చొరబడింది.

[embedyt] https://www.youtube.com/watch?v=P9k6PplEG5g[/embedyt]

దీంతో అక్కడ దుకాణంలో ఉన్న వ్యక్తులు, దుకాణానికి వచ్చే భక్తులు కూడా బెంబేలెత్తిపోయారు. జనాలను చూసిన పాము భయపడి దుకాణంలోపల ఓ మూల దూరుకుంది. దీంతో స్థానికులు టీటీడీలో పని చేస్తూ రిటైర్ అయిన భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. తీరా అది తోకతోనే ఓ సిలిండర్‌కు చుట్టుకుని తిరగబడింది. మరోమారు ప్రయత్నం చేసి భాస్కర్ నాయుడు పామును సిలిండర్ నుంచి విడిపించాడు.

ఇంతకీ ఆ పాము ఎంత పొడవు ఉంది తెలుసా? ఏకంగా 11 అడుగులకు పైమాటగానే జెర్రిపోతు. భాస్కర్ నాయుడు దానిని పట్టుకుని ఉండగా అక్కడున్న కొందరు యువకులు సెల్పీలు దిగారు.

ఆ తరువాత భాస్కర నాయుడు దానిని తీసుకెళ్ళి తిరుమలలోని శివార్లలో దట్టమైన అడవుల్లో వదిలేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*