శ్రీవారి తొలి పాలకమండలి ఏది? ఎంతమంది సభ్యులుండేవారు?

కలియుగ వేంకటనాథుని ఆలయ ఆలనా పాలనా చూసిన తొలి పాలకమండలి ఏది? అప్పట్లో ఎంతమంది సభ్యులు ఉండే వారు.? ఆ పాలకమండలి ఎక్కడి నుంచి పాలన సాగించేది.?

ఆసక్తికరంగా ఉంది కదూ… నిజమే. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సభ్యత్వం కోసం దేశ,విదేశాలకు చెందిన వారు పోటీ పడుతుంటారు. వారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్రల నుంచి ప్రతినిధులుగా సభ్యులు ఉంటారు. ఇందులో వారు వీరు అనే తేడా లేదు.

సంపన్న వర్గాలు, పారిశ్రామిక వేత్తలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, చివరకు సాఫ్టువేరు రంగసంస్థల వ్యవస్థాపకులు కూడా ఈ జాబితాలో ఉంటారు.

అంతకు మునుపు 11 మంది సభ్యులకు మాత్రమే పరిమితమైన క్రమక్రమంగా 18గా మారింది. ప్రస్తుతం 29 మంది సభ్యులు ఉన్నారు. వీరు కాకుండా అధికారులు కూడా ఉంటారు.

గతంలో ఎంతమంది సభ్యులు ఉండేవారు? ఎక్కడ పాలకమండలి ఉండేదనే అంశాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోక తప్పదు. అందుతున్న శాసనాల ఆధారంగా కీ.శ. 8వ శతాబ్దం నుంచే పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది.

అప్పట్లో వెలువడిని శాసనంలో ఈ పాలకమండలి ప్రస్తావన వచ్చింది. 108 మంది సభ్యులతో పాలకమండలి ఉండేదట. ఈ సభ్యులందరూ వైష్ణవ సభ కింద పని చేసేవారు.

ఈ సభ కార్యక్రమాలన్ని తిరుచానూరు నుంచే నడిచేవి. అప్పట్లో భక్తులు తిరుమలలో ఉండే వారు కాదు. అర్చకులు కూడా ఉదయం నైవేద్యాలు, ప్రసాదాలు తీసుకుని తిరుమలకు వెళ్ళి కైంకర్యాలు పూర్తి చేసి సాయంత్రానికి తిరుచానూరు చేరుకునేవారు.

భక్తుల కూడా స్వామి దర్శనం చేసుకుని కొండదిగి వచ్చేసేవారు. స్వామికి సమర్పించాల్సిన కానుకలు ఏమైనా ఉంటే తిరుచానూరులోని వైష్ణవ సభ ఆద్వర్యంలోని పాలకమండలి ప్రతినిధులకు అందజేసేవారు.

తిరుమలలో వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ కార్యక్రమం జరగాలన్నా తిరుచానూరులోని పాలకమండలి నిర్ణయించేది. ఆ మేరకే అన్ని కార్యక్రమాలు జరిగేవి. ఈ విషయాలన్నీ 8వ శతాబ్ధంలో రూపొందించబడిన శాసనంలో ఉన్నాయి.

కాలక్రమేణా మార్పులతో పాలకులు,  బ్రిటీష్ ప్రభుత్వం, మహంతులు, నేడు ప్రభుత్వం నియమించిన పాలకమండలిగా మార్పులు జరుగుతూ వచ్చాయి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*