ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి సిఎం జగన్ బంగారు కానుక

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి ఆదివారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బంగారు ఆభ‌ర‌ణాన్ని ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించారు.

కార్తీక బ్ర‌హ్మోత్సవాల్లో భాగంగాపంచమితీర్థ మహోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ముఖ్య‌మంత్రి త‌ర‌ఫున టిటిడి ఛైర్మ‌న్‌ వైవి.సుబ్బారెడ్డి ఈ ఆభ‌ర‌ణాన్ని ఆల‌య అధికారుల‌కు అందించారు.

వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ రూ.7 ల‌క్ష‌లు విలువైన 113 గ్రాముల బ‌రువు గ‌ల అన్‌క‌ట్ డైమండ్ నెక్లెస్ అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు.

కీర్తిశేషులు శ్రీ వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తిరుమ‌ల గ‌రుడ సేవ‌కు బ‌దులు ధ్వ‌జారోహ‌ణం నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించే విధానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీ‌కారం చుట్టార‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడైన గౌ.ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుచానూరులోని ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో విశేష‌మైన పంచ‌మీ తీర్థం రోజున రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌తి ఏడాదీ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించే సంప్ర‌దాయాన్ని ప్రారంభించార‌ని తెలియ‌జేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*