అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం‌ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్ కుమార్‌, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

మ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు నారాయణ స్వామి చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టిటిడి అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*