తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరిరోజైన డిసెంబరు 1న పంచమితీర్థానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ పుష్కరిణి తనిఖీ చేశారు.
తిరుచానూరులో పంచమితీర్థం ఏర్పాట్లను జెఈవో శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో గేట్లు, పంచమితీర్థ మండపాన్ని పరిశీలించారు.
భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు, తిరిగి బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు ఆస్థానమండపంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ పంచమితీర్థానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పటిష్టంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామన్నారు.
భక్తుల కోసం 160 అన్నప్రసాదం కౌంటర్లు, 188 మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తిరుచానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో భక్తులు ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
అక్కడి నుండి విడతల వారీగా పుష్కరిణిలోకి అనుమతిస్తామని తెలిపారు.
పంచమితీర్థం ప్రభావం 48 గంటల పాటు ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు.
Leave a Reply